పాలజ్ కర్ర గణపతి దర్శనానికి నిర్మల్ నుంచి ప్రత్యేక బస్సులు!

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర (Maharashtra) నాందేడ్ జిల్లా బోకర్ మండలం పాలజ్‌ (Palaj) గ్రామంలోని ప్రసిద్ధ కర్ర గణపతి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం నిర్మల్ ఆర్టీసీ డిపో (Nirmal RTC Depot) ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కె. పండరి బుధవారం తెలిపారు.

నిర్మల్ నుంచి పాలజ్‌ కు ప్రయాణించే పెద్దలకు రూ. 140, పిల్లలకు రూ. 90 చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. భక్తులు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు నిర్మల్ బస్టాండ్‌ లోని స్టేషన్ మేనేజర్‌ను 7382842265 మొబైల్ నంబర్‌ లో సంప్రదించాలని సూచించారు.

Also Read : KCR ఫామ్‌హౌజ్‌ పై సీఎం సంచలన నిర్ణయం..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>