కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నాగోల్‌లో దారుణ హత్య చోటు చేసుకుంది. నయీం అనే రౌడీ షీటర్‌ను (Rowdy Sheeter Nayeem) కొందరు వ్యక్తులు వేట కొడవళ్లు, కత్తులతో నరికి చంపారు. సుప్రీం వైన్స్ షాపులో నయీం ఉన్నాడనే సమాచారంతో అతడి ప్రత్యర్థులు కారులో వచ్చి, వెంటాడి మరీ హతమార్చారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నయీం చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అక్కడి నుంచి పారిపోయారు. నయీం స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.
Also Read : యూపీఐ చెల్లింపుదారులకు శుభవార్త
Follow Us On : WhatsApp

