కలం, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎస్ఆర్ఎస్పీ నుంచి సరస్వతి కాలువకు (Saraswati Canal) సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) బుధవారం పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను(Mahesh Kumar Goud) కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలకు సాగునీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉందని శ్రీహరి రావు తెలిపారు. సరస్వతి కాలువకు వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి సరస్వతి కాలువకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. రైతుల సమస్యపై తక్షణమే స్పందించి నీటి విడుదలకు చర్యలు చేపట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు శ్రీహరి రావు కృతజ్ఞతలు తెలిపారు.

