కలం, బాసర: బాసర(Basara) గోదావరి నదిపై ఉన్న మొదటి రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొనడంతో (Train Accident) గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఏఎస్ఐ మహబూబ్ ఖాన్ బుధవారం వివరాలు వెల్లడించారు. మృతుడి వయస్సు సుమారు 58 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడు నీలిరంగు లుంగీ, సిల్వర్ రంగు టీషర్ట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు.
అతడి చేతిపై ‘కే.లక్ష్మి’ అనే పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9866637607 మొబైల్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.
Also Read : ఒక్క అక్షరం తేడా.. ప్రముఖ శాస్త్రవేత్తకు ఈసీ నోటీసు!
Follow Us On: X(Twitter)

