కలం, సంగారెడ్డి : సంగారెడ్డి (Sangareddy) కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు (ACB Raid) నిర్వహించారు. విద్యాశాఖ అధికారి గోవిందరాం (Govindaram) లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇన్స్పెక్షన్ చేసి పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడానికి రూ. 50,000 డిమాండ్ చేయగా, గత వారం లోనే రూ. 30,000 ఇవ్వగ మిగతా రూ. 20,000 కోసం ఫోన్ చేసి అడగడంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. బుధవారం కార్యాలయంలో రూ. 20,000 ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

