షాద్ నగర్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి.. బీఆర్ఎస్ ఫిర్యాదు

కలం, జగిత్యాల: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య (Shadnagar MLA) అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల ఆ పార్టీ నాయకులు జగిత్యాల (Jagtial) రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడ్డారు. వాటిపై విచారణ జరిపి భారతీయ శిక్షాస్మృతి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు తమ ఫిర్యాదును పోలీసులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు దావ సురేష్, పాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు ఆనంద్ రావు, గంగాధర్, సర్పంచులు సురేందర్, రాజేందర్, సీనియర్ నాయకులు పడిగెల గంగారెడ్డి, అంజన్న, మల్లేశం, సాగర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు శ్రీరాముల గంగాధర్, చిత్తరి శ్రీనివాస్, మాజీ సర్పంచులు తిరుపతి, ప్రవీణ్ గౌడ్, గంగారాం, అంజన్న, లక్ష్మణ్ రావు, యూత్ ప్రెసిడెంట్ సన్నీత్ రావు, వేణు, చందు, శ్రీపాల్, మోహన్, షఫీ, మహేష్, యోహాన్, రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Also Read : కేసీఆర్‌పై మాకు గౌరవం ఉంది: టీపీసీసీ చీఫ్​!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>