హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: లోలం శ్యాంసుందర్

నిర్మల్, కలం: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ విమర్శించారు. మంగళవారం నిర్మల్ (Nirmal ) జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.

ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2,500, వికలాంగులకు నెలకు రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి, ముధోల్ నియోజకవర్గ సమన్వయకర్తలు రమాదేవి, కిరణ్, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>