భగత్ నగర్‌లో వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని (Karimnagar) భగత్ నగర్‌లోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శ్రీ కృష్ణుడి చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొట్టి యాదగిరి సునీల్ రావు ఉట్టి కొట్టే పోటీలను ప్రారంభించారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న యువకులపై రంగు నీళ్లు చల్లుతూ ఉత్సాహపరిచారు. ఈ వేడుకల్లో విజేతలుగా నిలిచిన యువకులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు, నాయకులు, భగత్ నగర్ కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>