బీఆర్ఎస్ శ్రేణుల నిరసన.. మార్మోగిన కోర్టు చౌరస్తా

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వెయ్యి రోజుల అరాచక, వైఫల్య పాలనపై బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల నిరసన (BRS Protest) కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు హోరాహోరీగా నిరసనలు హోరెత్తించారు. ఇందులో భాగంగానే నేడు జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ కళ్లు తెప్పించేలా ప్రత్యేకంగా రూపొందించిన వినతి పత్రాన్ని సమర్పించారు.

​ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను గాలికొదిలేసిందని, ఇప్పటికైనా ఆ పార్టీ తన మనసు మార్చుకుని ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేలా చూడాలని అంబేద్కర్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో కోర్టు చౌరస్తా ప్రాంతం మార్మోగింది.

​ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో ప్రజాపాలన పూర్తిగా అటకెక్కిందని, ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పిలుపుమేరకు చేపట్టిన ఈ వారం రోజుల ఆందోళనల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని తెలిపారు.

ఏడవ రోజు ప్రభుత్వానికి సద్బుద్ధి కలగాలని, అంబేద్కర్‌ ఆశీస్సులతోనైనా కాంగ్రెస్ పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించినట్లు స్పష్టం చేశారు. ​ఇదే సమయంలో ప్రజాస్వామ్య బద్ధంగా అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ దురుసుగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డట్టేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>