కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల (Telangana Employees)కు మరోసారి గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్ 2025కి సంబంధించి రూ.713 కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు డిసెంబర్ 31న ఈ బిల్లులను విడుదల చేశారు. ఈ నిధుల్లో ఉద్యోగుల గ్రాట్యూటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF), సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, వివిధ అడ్వాన్స్‌లకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి.
ఉద్యోగ సంఘాల (Telangana Employees Associations)కు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతినెల కనీసం రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తోంది. జూన్ నెలాఖరులో రూ.183 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఆగస్టు నుంచి నెలకు రూ.700 కోట్లకు పైగా విడుదల చేస్తూ కొనసాగుతోంది. నవంబర్ 2025కి సంబంధించి కూడా ప్రభుత్వం రూ.707.30 కోట్లు విడుదల చేసింది. ఇది వరుసగా నాలుగో నెలగా ఈ హామీ అమలు అవుతోందని అధికారులు తెలిపారు. ఈ నెలలో కూడా గ్రాట్యూటీ, GPF, సరెండర్ లీవ్, అడ్వాన్స్ బిల్లులు పరిష్కారమయ్యాయి. ఈ నిరంతర చర్యలతో ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారి వెల్ఫేర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం చూపిస్తోంది. 2025 చివరి రోజున ఈ విడుదల ఉద్యోగులకు డబుల్ ఆనందాన్ని కలిగించింది.
Read Also: న్యూ ఇయర్ వేడుకలకు తాడ్వాయికి రండి: మంత్రి సీతక్క
Follow Us On : WhatsApp


