కేజీబీవీ వర్కర్ల సమస్యలపై TUCI పోరుబాట

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని కేజీబీవీలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్ల (KGBV Workers) వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో ఈనెల 11న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను నిజామాబాద్ సౌత్, నార్త్ కేజీబీవీలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ.. కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్ల వేతనాలు ఏళ్లుగా పెరగకపోగా, పనిభారం మాత్రం పెరుగుతోందన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న సమయంలో నిబంధనలు, జాబ్ చార్ట్‌కు విరుద్ధంగా అదనంగా నైట్ డ్యూటీలు కేటాయిస్తున్నారని ఆరోపించారు.

గత మూడేళ్లుగా అధికారులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యల పరిష్కారం కోసం విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. దీంతో పోరాటం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అకౌంటెంట్లు, వర్కర్లకు ఇటీవల కేటాయించిన నైట్ డ్యూటీలను రద్దు చేయాలని, వారానికి ఒకరోజు వీక్లీ ఆఫ్ అమలు చేయాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత ఉన్న నాన్ టీచింగ్ సిబ్బందికి వెయిటేజీ కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేసి ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఈనెల 11న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీల నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది అఖిల, నగ్మా, రజిని, బాలమణి, మంజుల తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>