ఫారెస్ట్ అధికారుల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య..!

కలం, మెదక్ బ్యూరో : ఫారెస్ట్ అధికారుల వేధింపులు తాళలేక మెదక్ (Medak) మండలం పాతూరు (Pathur) గ్రామానికి చెందిన భూస పోచయ్య అనే వ్యక్తి రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఉడుమును పట్టారనే ఆరోపణలతో ఫారెస్ట్ అధికారులు పోచయ్యతో పాటు ఆయన కుమారుడిపై కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో అధికారులు తమను మూడు రోజుల పాటు తీవ్రంగా కొట్టారని, శారీరకంగా, మానసికంగా వేధించారని పోచయ్య కుమారుడు ఆరోపించారు.

కాగా, రాత్రి తిరిగి అధికారుల నుంచి పిలుపు రావడంతో, మళ్లీ వెళ్లి దెబ్బలు తినాల్సి వస్తుందనే భయంతో పోచయ్య తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచారని, పోచయ్య మృతికి ఫారెస్ట్ అధికారుల అరాచకాలే కారణమని ఆరోపిస్తూ పాతూరు గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

చట్టప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి గానీ, విచారణ పేరుతో దాడి చేసే హక్కు అధికారులకు ఎవరిచ్చారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచయ్య మృతికి కారణమైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను వెంటనే సస్పెండ్ చేయాలని, విచారణ పేరుతో తండ్రికొడుకులపై జరిగిన దాడిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>