కలం, వెబ్ డెస్క్ : స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (Tata Madhusudhan) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీలో దుమారం రేపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుపై మంత్రి సీతక్క (Minister Seethakka) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ తో పాటు ఆయన తల్లిపై వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తల్లి ఎవరికైనా తల్లి అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. దళితులు కాబట్టే మాపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కంటతడి పెట్టుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఎమోషనల్ అవుతూ కనిపించారు. స్వర్గస్తులైన స్పీకర్ మాతృమూర్తిపై ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య వ్యాఖ్యలు చేసారంటూ మంత్రి సీతక్క బాధాతప్త హృదయంతో మాట్లాడుతుండగా…. స్పీకర్ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.
స్పీకర్ తల్లిని గౌరవప్రదమైన చైర్ ను అవమానించిన సభ్యులు తాతా మధుసూదన్, నవీన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. వారి వ్యాఖ్యలపై కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఖండించడంతో పాటు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దళిత వ్యక్తి స్పీకర్ గా ఉన్నాడు కనుకనే కేసీఆర్ సభకు రావడం లేదని ఆమె ఆరోపించారు. కేసీఆర్ డైరెక్షన్ వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు వీధుల్లో కొట్లాడినట్లుగా అసెంబ్లీ ముందు ప్రవర్తించారని సీతక్క (Minister Seethakka) విమర్శించారు.
Also Read : అసెంబ్లీ సాక్షిగా అవమానం.. సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు
Follow Us On: X(Twitter)

