తాతా మధు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఫైర్.. కేసీఆర్‌కు కీలక డిమాండ్

కలం, వెబ్ డెస్క్ : స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhusudhan) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఇది చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ తాతా మధు సభ్య సమాజం సహించలేదని భాష వాడారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలగించాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ బంధంపై సీఎం రేవంత్ కామెంట్స్

తాతా మధు వ్యాఖ్యలపై చర్చ సందర్భంగా ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. చీకటి మిత్రులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెర వెనుక బీజేపీ, బీఆర్ఎస్ ఫ్రెండ్షిప్ నడుస్తుందని అన్నారు. అయితే బీజేపీ లేవనెత్తిన సమస్యలపై చర్చ జరుగుతుందని తెలిపారు. సభా సంప్రదాయాలను సభ్యులు కాపాడాలని కోరారు. బీజేపీ కోరుతున్న 22Aపై చర్చ చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read : అసెంబ్లీ సాక్షిగా అవమానం.. సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>