కలం, నారాయణపేట: నారాయణపేట జిల్లా కలెక్టరేట్ నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి (Rajender Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి ఉండటాన్ని గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాటిని తొలగించేందుకు కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కనీసం పరిసరాల పరిశుభ్రతపై కూడా శ్రద్ధ చూపకపోవడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంచి నీరు కూడా ఇవ్వరా..?
కలెక్టరేట్లో మంచినీటి వసతి సక్రమంగా లేకపోవడంపైనా రాజేందర్ రెడ్డి (Rajender Reddy) ప్రశ్నించారు. కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) బోర్డును రాజేందర్ రెడ్డి పరిశీలించారు. అధికారుల పేర్లు, వివరాలు ఉండాల్సిన చోట తెల్ల కాగితం కనిపించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన సమాచారం ఎలా అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుతో పాటు ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
Also Read : అసెంబ్లీ సాక్షిగా అవమానం.. సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు
Follow Us On: X(Twitter)

