epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

డైరెక్టర్ మారుతిని అల్లు అర్జున్ నమ్మడం లేదా?

కలం, సినిమా: దర్శకుడు మారుతిని ప్రభాస్ నమ్మాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పాడు. త్వరలో ఆ సినిమా విడుదల కాబోతున్నది కూడా.. అయితే అల్లు అర్జున్ మాత్రం మారుతిని నమ్మడం లేదా.. నిజానికి అల్లు అర్జున్, మారుతి (Maruthi) మధ్య స్నేహం కూడా ఉంది. అయినప్పటికీ అతడికి చాన్స్ ఇవ్వలేదు ఐకాన్ స్టార్. ఇప్పుడు ఇదే చర్చ టాలీవుడ్‌లో నడుస్తోంది.

కొంత మంది హీరోలు కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి ఇష్టపడరు. కథ నచ్చినా మేకింగ్ ఎలా ఉంటుందో అని అవకాశం ఇచ్చేందుకు దైర్యం చేయరు. కొన్ని సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన దర్శకులను కూడా నమ్మరు. కానీ మరికొంతమంది హీరోలు కథ నచ్చితే ప్రయోగాలకు సిద్ధమవుతారు. అతడి గత రికార్డులను పెద్దగా పట్టించుకోకుండా చాన్స్ ఇచ్చేస్తారు. అలా అవకాశాలు ఇచ్చే స్టార్ హీరోల సరసన డార్లింగ్ ప్రభాస్ కూడా నిలిచారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. ఈ సినిమా డైరెక్టర్ మారుతి (Maruthi). హర్రర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే.. డైరెక్టర్ మారుతి, హీరో అల్లు అర్జున్.. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. బన్నీతో మారుతికి సినిమా చేయాలనివుంది కానీ.. ఇంత వరకు బన్నీ అవకాశం ఇవ్వలేదు. జీఏ 2 బ్యానర్‌లో మారుతి సినిమాలు తీసాడు. అల్లు శిరీష్‌తో సినిమా తీసాడు. అల్లు అరవింద్, బన్నీ వాసు… వీళ్లందరితో అనుబంధం ఉంది కానీ  బన్నీ సినిమా ఇచ్చేందుకు మారుతిని నమ్మలేదు.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. అయితే.. రాజాసాబ్ మూవీని జనవరి 9న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ విషయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా నమ్మకంగా ఉన్నారు మేకర్స్. ట్రైలర్ అయితే.. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనేట్టుగా ఉంది. ఈ మూవీ కనుక సక్సెస్ అయితే.. మారుతి పేరు మారుమ్రోగడం ఖాయం. ఏది ఏమైనా మారుతిని బన్నీ నమ్మలేదు.. ప్రభాస్ నమ్మాడు. ఈ విషయంలో ప్రభాస్ గ్రేట్. మరి.. రాజాసాబ్ సక్సెస్ అయితే.. మారుతితో సినిమా చేయడానికి బన్నీ (Allu Arjun) ముందుకొస్తాడేమో చూడాలి.

Read Also: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో.. ఆ హీరోతో అనిల్ రావిపూడి సినిమా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>