ముట్టడికి ముందే నిర్బంధం.. నిర్మల్‌లో బీజేపీ నేతల అరెస్టులు

కలం, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందే నిర్మల్ (Nirmal) జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం జిల్లాలోని పలువురు బీజేపీ నాయకులు (BJP Leaders), కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సెక్షన్‌ 22-ఏను రద్దు చేయడంతో పాటు విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పార్టీ పిలుపునిచ్చింది.

అయితే అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందుగానే బీజేపీ నాయకులను (BJP leaders) అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. అరెస్టులు, (Arrests) నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోలీసుల ద్వారా పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్షన్‌ 22-ఏ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు తమ పోరాటాన్ని ఆపలేవని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల తరఫున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.

Also Read : చీర లాగేశారని మహిళా ఎమ్మెల్యే కన్నీరు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>