కేటీఆర్‌కు గాయాలు.. పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ కీలక పిలుపు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాల తొలిరోజే అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. నల్ల దుస్తులు ధరించారన్న కారణంతో అసెంబ్లీకి వెళ్లకుండా బీఆర్ఎస్ (BRS) నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ ప్రతినిధులను అరెస్ట్ చేసి, ఆ తర్వాత వారిని తెలంగాణ భవన్‌కు తరలించారు.

కేటీఆర్ కు గాయాలు..

అయితే అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తలకు స్వల్ప గాయం అయినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. జగదీశ్ రెడ్డి(Jagadish Reddy)తో సహా పలువురు ఎమ్మెల్యేలకు స్వల్ప గాయాలు కాగా.. తోపులాటలో తన చీర లాగేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ దగ్గర పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు నిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ (BRS) శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది.

అందుకే బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకున్నాం: డీసీపీ శిల్పవల్లి

స్పీకర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకున్నామని డీసీపీ శిల్పవల్లి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్ట్ లతో పాటు వాటిపై స్లోగన్స్ రాసుకుని వచ్చారని తెలిపారు. తాము ఎవరిపై ఎలాంటి అనైతిక చర్య తీసుకోలేదని.. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన ఘటన జరగలేదని వెల్లడించారు. తమ డ్యూటీని మాత్రమే తాము నిర్వర్తించామని, బీఆర్ఎస్ నేతలను తెలంగాణ భవన్ కు తరలించామని వివరించారు.

Also Read : చీర లాగేశారని మహిళా ఎమ్మెల్యే కన్నీరు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>