కలం, తెలంగాణ బ్యూరో: హద్దు మీరి కామెంట్లు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పీసీసీ (TPCC ) కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల కొండా సుష్మిత వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ(Konda Surekha)కు నోటీసులు ఇవ్వడంతో పాటు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన పీసీసీ.. తాజాగా మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని కంది శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి, జూపల్లి మల్లారెడ్డి, నర్సారెడ్డికి పార్టీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఇచ్చింది.
వాళ్లిద్దరితో విభేదాల్లేవ్: మల్లు రవి
ప్రతి ఒక్కరూ పార్టీ లైన్‌లోనే పని చేయాలని, హద్దు మీరి ప్రవర్తిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి (Mallu Ravi) హెచ్చరించారు. తాను పొరపాటు చేసినా ఏఐసీసీకి ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం తన డిక్షనరీలోనే లేదని చెప్పారు. మాజీ మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తాను ఎవరిపైనా కక్షతో నివేదిక ఇవ్వలేదని తెలియజేశారు.
మహిళా మంత్రిగా సీఎంకు కొండా సురేఖ వచ్చి రాఖీ కట్టారని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ధర్మం ప్రకారం జరిగినవేనని పేర్కొన్నారు. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండాలని పార్టీ ఆదేశించిందన్నారు. పార్టీ శ్రేణులు తమ ఫిర్యాదులను గాంధీభవన్‌కి వచ్చి చెప్పుకోవచ్చునని సూచించారు. నకిరేకల్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రావడం మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు.
Also Read : సీఎం రేవంత్ ఇలాకాలో కవిత సభ
Follow Us On: X(Twitter)

