కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) తన యాత్రలో రూటు మార్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆమె బీఆర్ఎస్ నేతల మీదే తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కాస్త సుతిమెత్తగానే విమర్శలు చేసేవారు. అయితే తాజాగా కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కాస్త ఘాటుగానే మండిపడ్డారు. ఉద్యమకారులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వారి తరఫున తాము పోరాటం చేస్తానని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన కవిత.. జాగృతి సంస్థను బలోపేతం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జనంబాట కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నారు. తాజాగా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలపై నిప్పులు చెరిగారు. కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కవిత పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చినా ఉద్యమమే..
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సైతం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కరీంనగర్ గడ్డమీద ఏపోరాటం చేసిన అది సక్సెస్ అవుతుందని కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తామని, సంక్షేమ బోర్డుతో పాటు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఎన్నికల హామీలు పేర్కొన్నది కవిత అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎవ్వరికి ఇంటి స్థలాలు ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడికి అక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
పెత్తనం చెలాయిస్తున్న ఉద్యమద్రోహులు
రాష్ట్రం వచ్చిన తర్వాత నిజమైన ఉద్యమకారులు దారుణమైన పరిస్థితిలో ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు పార్టీలో చేరి మనపై పెత్తనం చెలాయించాలని చూస్తూ కేసులు సైతం పెడుతున్నారని కవిత (Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి వారిని జూన్ 2 ఆగస్టు 15 జనవరి 26న కనీసం గౌరవం ఇవ్వడం లేదని కవిత అన్నారు.
ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీలు అవసరమా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులు ఎవరో తెలియాలంటే ఎలాంటి కమిటీలు కేసులు అక్కరలేదని ఏ ఊరికి వెళ్ళిన ఉద్యమం చేసింది ఎవరు? చేయండి ఎవరు చెప్తారని కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పురమిచ్చిన డేటా ప్రకారమే ఉద్యమకారులను గుర్తించాలని శాంతియుతంగానే తాము పోరాటం చేస్తామని ఉద్యమకారులు ఎక్కడికి అక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?: కవిత
Follow Us On: Youtube


