కలం వెబ్ డెస్క్ : ఇటీవల భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్(SC Girls Hostel)లో విద్యార్థినిని చితకబాదిన వార్డెన్ భవానిపై బుధవారం క్రిమినల్ కేసు(Criminal Case) నమోదైంది. వార్డెన్ భవానిపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. తాజాగా భవాని హాస్టల్‌లో ఓ విద్యార్థినిని కర్రతో, చేతులతో కొడుతూ, బూతులు తిట్టింది. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు దీన్ని వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆమె ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమెను సస్పెండ్ చేయాలని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.
దీంతో మరుసటి రోజే భవానిని సస్పెండ్ చేస్తూ జిల్లా (Bhupalpally) కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. పది రోజుల క్రితం హాస్టల్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారన్న ఆరోపణలున్నాయి. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారిని ఇందిర ఫిర్యాదుతో వార్డెన్ భవానీతో పాటు హాస్టల్‌లోకి చొరబడ్డ వారిపై బీఎన్ఎస్ 115(2), 296(బీ), 329(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: యూట్యూబర్ అన్వేష్‌పై ఖమ్మంలో కేసు నమోదు
Follow Us On: Sharechat


