బీఆర్ఎస్ఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలపై కీలక సూచనలు చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని కేసీఆర్ (KCR) సూచించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఎండగట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను ఉభయ సభల్లో బలంగా ప్రస్తావిస్తూనే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముందుకు వెళ్లాలని కేసీఆర్ సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ అంశాన్ని పార్టీ ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచినట్లు సమాచారం.

ముఖ్యంగా 22A, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement)పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఉందని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ అంశాలతో పాటు అసెంబ్లీ స్పీకర్ పక్షపాత వైఖరి అవలంబిస్తే దాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అనుసించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై ఎర్రవెళ్లి భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read : కేసీఆర్ సంచలన డెసిషన్.. లక్ష మందితో!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>