ఇస్రో భవిష్యత్తుపై శాస్త్రవేత్తల ఆందోళన

కలం, వెబ్ డెస్క్: ఇస్రో (ISRO)లో ప్రైవేటీకరణ క్రమంగా పెరుగుతున్న వేళ సంస్థ భవిష్యత్తుపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 9 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాబోయే రోజుల్లో PSLV, LVM-3, SSLV వంటి కీలక ప్రాజెక్టుల్లోనూ ప్రైవేట్ భాగస్వామ్యం పెంచబోతున్నారా.. అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణను వద్దనడం లేదని, కానీ ఇస్రో మూల స్తంభాలైన డిజైనింగ్, బిల్డింగ్, లాంచింగ్ రాకెట్ల తయారీలో మాత్రం ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. ఇస్రో దశాబ్దాలుగా శ్రమించి తయారు చేసిన టెక్నాలజీ, సౌకర్యాలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తాయెమోనని ఆందోళన చెందుతున్నట్లు వివరించారు.

నియామకాలపై నేరుగా ప్రభావం..

ఇస్రో(ISRO)లో ప్రైవేటీకరణ కొద్దీ సంస్థలో నియామకాలు కూడా మెల్లగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు లేఖలో ప్రస్తావించారు. అది చివరికి సాంకేతిక మందగమనం వైపు దారి తీయొచ్చని హెచ్చరించారు. అంతేగాకుండా, రాబోయే రోజుల్లో లాంచింగ్ వెహికల్స్ తయారీ కూడా తగ్గిపోతుందనే సంకేతాలు వస్తున్నాయని, దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటీకరణ ఎంత వేగంగా జరుగుతున్నా.. ఇస్రో లాంటి అత్యున్నత ప్రభుత్వం ఏజెన్సీలు తన విలువలు, విశిష్టతను కోల్పోవద్దని స్పష్టం చేశారు.

Also Read : ఒకరు దూరం.. మరొకరు దగ్గర: కోమటిరెడ్డి బ్రదర్స్ ‘మార్క్’ పాలిటిక్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>