స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు.. SECకి వైసీపీ వినతి

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘంకు వైసీపీ వినతిపత్రం సమర్పించింది. గత స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలను ప్రస్తావిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి (SEC) ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కేంద్ర బలగాలను మోహరించాలని ఆయన ఎన్నికల కమిషన్‌ను కోరారు. వైసీపీ వినతిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా సానుకూలంగా స్పందించారు. వైసీపీ సమర్పించిన వినతిపత్రాన్ని తదుపరి చర్యల కోసం డీజీపీకి పంపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>