“ఓటుకు నోటు” ఫ్లెక్సీతో కరీంనగర్‌లో హోరెత్తిన బీఆర్ఎస్ నిరసనలు!

​కలం, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ (BRS Protest ) చేపట్టిన నిరసన కార్యక్రమాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉధృతంగా కొనసాగుతున్నాయి. నిరసనల్లో భాగంగా ఐదో రోజు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ​కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండా ఊపి ఈ ఆటో ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ఆటో నడిపి కార్మికులకు మద్దతు తెలిపారు.

ర్యాలీ ప్రారంభానికి ముందు తెలంగాణ చౌక్ వద్ద ప్రదర్శించిన ఒక ఫ్లెక్సీ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రానికి ఒకవైపు TDP, మరోవైపు కాంగ్రెస్ కండువాలు వేసి, “ఓటుకు నోటు దొంగ” అనే అంశంతో వినూత్న రీతిలో ఈ ఫ్లెక్సీని రూపొందించారు. “నిన్న ఒక జెండా, నేడు ఇంకో కండువా… నేను అటు కాంగ్రెస్, ఇటు TDP… ఎటు లాభం ఉంటే అటు జంప్” అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ ఫ్లెక్సీ ద్వారా BRS నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

​అసెంబ్లీలో గళం విప్పుతాం: గంగుల

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై BRS పక్షాన గట్టిగా గళం వినిపిస్తామని, ప్రభుత్వం మెడలు వంచైనా హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>