కలం, వెబ్ డెస్క్ : ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ (Madhuri Rathod) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన తోటి డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆయనను ఇంకా అరెస్ట్ చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇంట్లోని ఫ్యాన్‌కు వేలాడుతున్న మాధురిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు బద్దలు కొట్టి, ఆమెను సురక్షితంగా కాపాడారు. తనను మోసం చేసిన ఈశ్వర్ సాయిని నార్సింగి పోలీసులు తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాధురి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా నిందితుడిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని ఆమె పేర్కొన్నారు.

