కలం, వెబ్డెస్క్: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఇంట్లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. షర్మిల కుమార్తె అంజలి రెడ్డి (Anjili Reddy) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని షర్మిల తన సోషల్ మీడియా ఖాతా నుంచి అధికారికంగా ప్రకటించారు. డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో తన కుమార్తె వివాహం నిశ్చయమైనట్లు షర్మిల వెల్లడించారు. వీరిద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులు సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డి అని తెలిపారు.
సోమల రఘురామ్ రెడ్డి కుటుంబం స్వస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా కాగా, ప్రస్తుతం వీరంతా అమెరికా పౌరులుగా నివసిస్తున్నారని తెలిపారు. ఈ శుభ సందర్భాన్ని దేవుని దయగా పేర్కొంటూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. తమ కుమార్తె వివాహం ఘనంగా జరిగేందుకు స్నేహితులు, శ్రేయోభిలాషులందరు ప్రార్థించాలని షర్మిల దంపతులు కోరారు. ఇక షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో 2024లో జరిగిన విషయం తెలిసిందే.

