కలం, వెబ్ డెస్క్: ఏపీలోని సింహాచలం ఆలయ (Simhachalam Temple) ప్రసాదంలో నత్త వచ్చిందంటూ ఇటీవల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాము కొనుగోలు చేసిన పులిహోర ప్రసాదంలో నత్త కనిపించందంటూ ఓ జంట సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీంతో సింహాచలం ప్రసాదంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ ఘటనపై ఆలయ (Simhachalam Temple) ఈవో స్పందించారు. పులిహోర ప్రసాదంలో నత్త రావడం అసాధ్యమని ఈవో స్పష్టం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. ‘పులిహోర ప్రసాదం తయారీ 3 దశల్లో జరుగుతుంది. రోజూ సుమారుగా 20 వేల ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తాం.
గత 31 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగలేదు. పులిహోర ప్రసాదంలో కావాలనే నత్త పెట్టి ప్రచారం చేసినట్లు అనుమానం ఉంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అంటూ ఆలయ ఈవో వివరించారు. ఏపీలోని ఆలయాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా అనేక వివాదాలు చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. తిరుపతి లడ్డూ ప్రసాదం ఘటనపై ప్రస్తుతం ఎంక్వైరీ సాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం కావడంతో ప్రతి చిన్న అంశం క్షణాల్లో వైరల్ అవుతోంది.
Read Also: సింహాచలం ప్రసాదం కేసులో సీన్ రివర్స్.. బాధితులపై పోలీసుల విచారణ
Follow Us On: Instagram


