ఎన్‌హెచ్‌ఏఐ నిర్లక్ష్యం.. కడ్తాల్‌ సర్పంచ్‌ చొరవతో హైవే క్లియర్‌!

కలం, సోన్ : సోన్ మండలం ( Soan Mandal)  కడ్తాల్ గ్రామంలో 44వ జాతీయ రహదారి సమీపంలో ఏపుగా పెరిగిన చెట్లతో గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి పక్కన పెరిగిన చెట్లు, కొమ్మలు రోడ్డువైపు విస్తరించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సమస్యను గ్రామ సర్పంచ్ గుర్రం రాముకు వివరించారు. వెంటనే స్పందించిన సర్పంచ్ జేసీబీ సహాయంతో రహదారి సమీపంలో ప్రమాదకరంగా పెరిగిన చెట్లు, కొమ్మలను తొలగించారు. దీంతో రహదారి పక్కన ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోవడంతో వాహనదారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్‌ కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>