విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలి: కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం గురుపూజోత్సవ వేడుకలను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 60 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 100కి చేరేలా ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు బోధన చేయాలని, ఏది మంచో, చెడో విడమర్చి చెప్పాలని సూచించారు.

గ్రామాల్లో బెల్టు దుకాణాలు లేకుండా చూడటంలో విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యవంతం చేయడంలో యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారిణి మాధవి, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>