కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని.. నెల నెల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది.
అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిపోయినా ఆ హామీని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా కవిత ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్‌లో (Karimnagar) ఆమె ఉద్యమకారులతో కలిసి నిరసన చేపట్టారు.
ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం డిమాండ్ చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత (kavitha) రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలను ఎత్తి చూపుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం డైరెక్ట్ కౌంటర్
Follow Us On : WhatsApp


