కొత్తపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గిరిప్రదక్షిణ

​కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి (చిన్నగుట్ట) సన్నిధిలో సెప్టెంబర్ 7 (సోమవారం) ఉదయం 7:15 గంటలకు పవిత్ర గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీ వెంకటేశ్వర దేవాలయ ట్రస్టు ప్రతినిధులు, కొత్తపల్లి పట్టణ ప్రజలు తెలిపారు. ​శ్రావణమాస కృష్ణపక్ష ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూజ్య గురువులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ సచ్చిదానంద ఆశ్రమం, రామాలయం వద్ద నుంచి ఈ గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది.

సుమారు 2.5 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రదక్షిణలో చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు సహా భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు పులిహోర ప్రసాదం, మంచినీటి సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు. ​గిరిప్రదక్షిణకు విచ్చేసే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి, భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.

కరీంనగర్, కొత్తపల్లితో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బండ గోపాల్ రెడ్డి, బండ కిషన్ రెడ్డి, నరహరి నారాయణ రెడ్డి, పెద్ది కొమురయ్య (కుమార్), బోగ సుదర్శన్, ముత్యం గణపతి, వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, సామల శ్రీనివాస్, బూస శంకర్, మందల నారాయణ రెడ్డి, లెంకల రాజభాస్కర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>