కలం, వెబ్ డెస్క్ : ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుని రూ.ఏడున్నర వేల కోట్లు దిగమింగి కుర్చీ దిగి వెళ్లిపోయాడనీ మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. నకికల్ లోని నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,617 కోట్లతో రూ.2లక్షల రుణమాఫీ చేశామని రేవంత్ (CM Revanth Reddy) తెలిపారు. రైతులు పండించిన పంటకు ఆనాటి సీఎం కేసీఆర్ గిట్టుబాటు ధర ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు. రూ.36 వేల కోట్లతో రైతుకు నగదు బదిలీ చేశామన్న సీఎం.. ఈ అంశంపై సిద్దిపేట గడ్డమీద అయినా సిరిసిల్ల అడ్డామీద అయినా చర్చించడానికి సిద్దంగా ఉన్నామని రేవంత్ సవాల్ విసిరారు.
కేటీఆర్ కు రేవంత్ కౌంటర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ల వర్షం కురిపించారు. తనకు చదువు రాదని కేటీఆర్ చెబుతున్నాడని.. నాకు చదువు రాకపోయినా సంస్కారం ఉందన్నారు సీఎం. నాకు సంస్కారం ఉంది కాబట్టే మీరు రోడ్ల మీద తిరుగుతున్నారని కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ చురకలంటించారు.
‘నీ సొంత చెల్లెలు రాఖీ కడతానని వస్తే మెడపట్టి నెట్టావు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన గొప్పోడివా.. శాసన సభకు రా మాట్లాడుదాం.. నీ సంస్కారం ఏంటో నా సంస్కారం ఏంటో చూసుకుందాం’ అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. దోచుకున్న ఆస్తిలో వాటాలు ఇవ్వాల్సి వస్తుందనే కవితను బయటకు వెళ్లగొట్టారని సీఎం విమర్శించారు.
Also Read : బీజేపీ చెత్త కుప్ప కాదు: మురళీధర్ రావు
Follow Us on : WhatsApp

