నకిరేకల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాంతీయ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నకిరేకల్ (Nakrekal) ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమాల అనంతరం రాజీవ్ గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Also Read : మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిస్తాం: సీతక్క

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>