ఎస్పీని కలిసిన నూతన పోలీస్ అధికారుల కార్యవర్గం

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా పోలీస్ (Nirmal Police) అధికారుల సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జిల్లా ఎస్పీ జానకి షర్మిలను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గ సభ్యులను ఎస్పీ అభినందించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, విధుల్లో ఎదురయ్యే ఇబ్బందులపై సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, సమన్వయం, సేవాభావాన్ని మరింత బలోపేతం చేయడంలో పోలీస్ అధికారుల సంఘం కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఆర్‌ఐ అమిత్ రామ్‌, జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>