కలం, వెబ్‌డెస్క్: నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీజేపీ (Telangana BJP) అధికారిక సోషల్ మీడియా ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై సెటైరికల్ ఏఐ వీడియో (AI Video)ను పోస్ట్ చేశారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌లను కూడా చేర్చారు. మోసాలు చేయడంలో పప్పు క్లాసులు, తూచ తప్పకుండా పాటిస్తున్న శిష్యులు అంటూ దీనికి క్యాప్షన్ జోడించారు. పప్పు గారి క్లాసులు.. రేవంతుల వారి మోసాలు.. తప్పక వినాల్సిన క్లాస్ అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఇక వీడియో విషయానికొస్తే అందులో రాహుల్ గాంధీ టీచర్‌గా సీఎం రేవంత్, పొన్నం, భట్టి విద్యార్థులుగా ఉన్నారు.
యువతకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తారు. దీనికి రేవంత్ సమాధానమిస్తూ గుర్తున్నాయని, అందుకే అమలు చేయకుండా దాచిపెట్టానని చెప్తారు. మళ్లీ రాహుల్ ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి ప్రశ్నిస్తారు. దీనికి మంత్రి పొన్నం స్పందిస్తూ హామీ అయితే ఇచ్చామని చెప్తారు. మరి డబ్బులు అని రాహుల్ అడగ్గా.. బడ్జెట్లో ఉన్నాయి కానీ, విద్యార్థుల ఖాతాల్లో లేవని భట్టి సమాధానమిస్తారు. స్కూటీల గురించి రాహుల్ ప్రశ్నించగా.. రేవంత్ స్పందిస్తూ ముందు హెల్మెట్లు కొనుక్కోమ్మని చెప్తూ, స్కూటీలు ఎప్పుడు వస్తాయో తమకే తెలియదన్నారు. మరి విద్యార్థులకు ఏం నేర్పిస్తారని రాహుల్ రేవంత్‌ను ప్రశ్నిస్తారు. హామీలు ఇచ్చి ఎగ్గొట్టడం నేర్పిస్తానని రేవంత్ సహా పొన్నం, భట్టి నవ్వేస్తారు. ఇక ఈ వీడియోపై కాంగ్రెస్ మద్దతుదారులు కామెంట్లు చేస్తున్నారు. మరి మోదీ హామీల సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.
మోసాలు చేయడంలో పప్పు క్లాసులు
తూచ తప్పకుండా పాటిస్తున్న శిష్యులు pic.twitter.com/cs49bvmdWq— BJP Telangana (@BJP4Telangana) September 5, 2026

