యాదవుల ఐక్యతకు ప్రతీకగా కృష్ణాష్టమి వేడుకలు

కలం, కరీంనగర్: అఖిల భారత యాదవ మహాసభ – కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ నాయకత్వంలో స్థానిక యాదవ ట్రస్ట్ భవనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ​ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. యాదవ సమాజం (Yadava Community) సుఖసంతోషాలతో, ఐకమత్యంతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. అనంతరం యాదవ సోదర సోదరీమణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుని బోధనలు మనకు ధైర్యం, ధర్మం, ఐక్యతను నేర్పిస్తాయని తెలిపారు. మనమంతా ఒక్కటిగా ఉంటేనే యాదవ సమాజం మరింత బలంగా ఎదుగుతుందన్నారు. ఈ జన్మాష్టమి వేడుకలు కేవలం ఒక పండుగగా కాకుండా, యాదవుల ఐక్యత, ఆత్మీయత, సంప్రదాయం, సంస్కృతి, సామాజిక బలానికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తమ్మనవేణి నరసయ్య యాదవ్, కార్యదర్శి ఆవుల మల్లేశం యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సందబోయిన ప్రసాద్ యాదవ్, ముఖ్య అతిథులుగా 10వ డివిజన్ కార్పొరేటర్ సౌగాని కొమురయ్య యాదవ్, బుస అంజన్న యాదవ్, ముంజ రాజేందర్ యాదవ్ పాల్గొన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు సందబోయిన గీతాంజలి యాదవ్, చర్ల పద్మ యాదవ్, వైజయంతి యాదవ్, కాల్వ లక్ష్మి యాదవ్, కాల్వ మల్లేశం యాదవ్, కాల్వ శ్రీనివాస్ యాదవ్, కాల్వ లింగయ్య యాదవ్, గాదం శ్రీనివాస్ యాదవ్, జంగ కొమురయ్య యాదవ్, వేల్పుల ఓదెలు యాదవ్, వేల్పుల కొమురయ్య యాదవ్, గొర్ల కొమురయ్య యాదవ్, పొలగని మహేష్ యాదవ్, కొండ రవి యాదవ్, ముక్కెర కొమురయ్య యాదవ్, రాదరపు కుమార్ యాదవ్, సందబోయిన రాజేశం యాదవ్, హరీష్ యాదవ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>