సెంచరీతో స్మృతి మందానా చరిత్ర.. హాంకాంగ్ చిత్తు!

కలం, స్పోర్ట్స్: ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మందానా (Smriti Mandhana) విధ్వంసక శతకంతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. కేవలం 64 బంతుల్లోనే 124 పరుగులు చేసిన మంధానా.. తన ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు బాదింది. 193.75 స్ట్రైక్‌రేట్‌తో పరుగుల వరద పారించింది. మందానా మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్‌గా వచ్చిన స్మృతి మందానా (Smriti Mandhana) ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. హాంకాంగ్ బౌలర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన మంధానా.. తక్కువ బంతుల్లోనే భారీ స్కోరు సాధించింది. ఆమెకు సహచర బ్యాటర్ల నుంచి కూడా సహకారం లభించడంతో భారత్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది.

ఈ ఇన్నింగ్స్‌తో మంధానా బ్యాటింగ్‌లో మరో అరుదైన ఘనతను అందుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉంది. మిథాలీ రాజ్ 10,868 అంతర్జాతీయ పరుగులు సాధించగా.. హాంకాంగ్‌పై చేసిన 124 పరుగులతో మంధానా ఆ రికార్డును అధిగమించింది. దీంతో ఆమె మొత్తం అంతర్జాతీయ పరుగుల సంఖ్య 10,880కి చేరింది. ఈ ఘనతతో భారత మహిళల క్రికెట్‌లో మంధానా మరో చరిత్ర సృష్టించింది.

అంతేకాదు.. మూడు ఫార్మాట్లలోనూ శతకాలు చేసిన భారత క్రికెటర్ల జాబితాలోనూ మందానా చోటు సంపాదించింది. ఇప్పటివరకు ఈ జాబితాలో ఇద్దరు భారత పురుష క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. వారితో పాటు మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి, ఏకైక భారత మహిళగా స్మృతి నిలిచింది. దీంతో హాంకాంగ్‌తో మ్యాచ్ ఆమెకు వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రత్యేకంగా మారింది. ఒకే ఇన్నింగ్స్‌తో భారీ పరుగులు చేయడంతో పాటు అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది.

భారత్ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హాంకాంగ్‌కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్లను ఎదుర్కోవడంలో హాంకాంగ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. వరుసగా వికెట్లు కోల్పోతూ లక్ష్యానికి దూరమయ్యారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హాంకాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

చివరికి హాంకాంగ్ జట్టు కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 137 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో స్మృతి విధ్వంసక శతకంతో మెరిసిపోగా.. బౌలర్లు కూడా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో భారత్‌కు భారీ విజయం దక్కింది. మందానా రికార్డు శతకం, ఆమె సాధించిన అరుదైన ఘనతలతో హాంకాంగ్‌తో జరిగిన ఈ మ్యాచ్ ఆసియా కప్‌లో ప్రత్యేకంగా నిలిచింది.

Also Read : వరంగల్‌లో హనీట్రాప్.. ప్రేమ పేరుతో రూ.15 లక్షల మోసం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>