కలం, నిర్మల్: రైతు కూలీల సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.ఆర్. ఉపాలి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో విగ్రహం వద్ద AIKMS 9వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో పాటు, పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి రాక రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర మహాసభలకు రైతులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి శేఖర్, నాయకులు రాజు, ప్రసాద్, రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఈలా దూకుడు.. యూఎస్ ఓపెన్‌లో మరో విజయం!
Follow Us On: X(Twitter)

