కలం, కరీంనగర్ బ్యూరో: ప్రధాని మోదీ 25 ఏళ్ల సేవా ప్రయాణాన్ని, వికసిత్ భారత్ 2047 సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈనెల 17 నుండి అక్టోబర్ 17 వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప అభియాన్’ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం (Saini Mallesham) పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని శుభమంగళ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం రోజున ‘సేవా సంకల్ప అభియాన్’ జిల్లా కార్యశాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సాయిని మల్లేశం.. పార్టీ శ్రేణులకు కార్యక్రమ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ రాజకీయ జీవితాన్ని, ఆయన అంకితభావాన్ని కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు.
దేశం కోసం, ప్రజల సంక్షేమం కోసం సేవా సంకల్పంతో నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందని మల్లేశం అన్నారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్, రాష్ట్ర అధికార ప్రతినిధి సునీల్ రావు , సీనియర్ నాయకులు, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి కన్నబోయిన ఓదెలు లు మాట్లాడుతూ.. వికసిత్ భారత్ 2047 సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రధాని మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్టీ సూచించిన, నిర్దేశించిన ప్రతీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలని పార్టీ శ్రేణులకు మల్లేశం (Saini Mallesham) సూచించారు. సేవా సంకల్ప్ అభియాన్ ప్రోగ్రాం జిల్లా కన్వీనర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవెంకటరెడ్డి సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా జాతీయ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పోలింగ్ బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు, సేవా సంకల్ప్ అభియాన్ ప్రోగ్రాం కో కన్వీనర్ సంఘ నరేష్, గుంజేటి శివ, సుగుర్తి జగదీశ్వరాచారి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, వైద రామానుజo, పుప్పాల రఘు, దండు కొమురయ్య , కరివేద మహీపాల్ రెడ్డి, అలివేలు సమ్మిరెడ్డి మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు మోతే గంగారెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణలతోపాటు మండల, జోన్ అధ్యక్షులు, సేవా సంకల్ప్ అభియాన్ మండల కన్వీనర్లు కో కన్వీనర్లు, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : వరంగల్‌లో హనీట్రాప్.. ప్రేమ పేరుతో రూ.15 లక్షల మోసం
Follow Us On : WhatsApp

