కలం, వెబ్ డెస్క్: న్యూ ఇయర్ (New Year) వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినప్పటికీ, కొన్ని సడలింపులు ఇచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ చేసింది. దీంతో మద్యం షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతి ఉండగా, ఒంటి గంట వరకు బార్లు (Bars), క్లబ్‌లకు అనుమతి ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగనుంది. దాదాపు 100 ప్రదేశాలలో పోలీసు (Police) బృందాలు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించనున్నాయి. ప్రజలు బాధ్యతయుతంగా వేడుకలను జరుపుకోవాలని పోలీసులు సూచించారు.


