కలం వెబ్ డెస్క్ : న్యూ ఇయర్(New Year) సమీపించడంతో ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) నగరంలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్(Drunk Driving) తనిఖీలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటే వరకు వాహనదారులను పరీక్షిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటే వరకు ఎస్ఆర్‌నగర్(SR Nagar), యూసఫ్‌గూడ(Yousufguda)లో తనిఖీలు నిర్వహించారు. పలువురు మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు. ఎస్ఆర్‌నగర్‌లో 20 వాహనాలు, యూసఫ్‌గూడలో 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.


