కలం, తొర్రూర్ : భార్యభర్తల మధ్య గొడవను ఆపేందుకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ పై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Thorrur) పట్టణంలోని 14వ వార్డులో కుటుంబ గొడవల నేపథ్యంలో డయల్-112కు వచ్చిన ఫిర్యాదు వచ్చింది. దీనిపై స్పందించిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోందన్న సమాచారంతో బ్లూకోల్ట్ కానిస్టేబుల్ జాటోత్ రామచంద్రు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి కానిస్టేబుల్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రామచంద్రు ఎడమ చేతికి తీవ్ర గాయమైంది.
వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించి గాయానికి ఆరు కుట్లు వేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు కోటేశ్వరరావును అరెస్టు చేశారు. అనంతరం తొర్రూరు కోర్టు(Thorrur Court)లో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : స్మృతికి కెప్టెన్సీ ఇవ్వాలి: డయానా ఎడుల్జీ కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

