ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నిరసన సెగ.. అంతంపేటలో ఉద్రిక్తత!

కలం, చండూరు : మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ( MLA Raj Gopal Reddy ) గ్రామస్థుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. గట్టుప్పల్ మండలం అంతంపేట (Anthampet) గ్రామంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ఆయనను స్థానిక మహిళలు, యువకులు అడ్డుకుని నిలదీశారు. గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేరుకోగానే గ్రామస్థులు ఆయన కాన్వాయ్‌ను ముట్టడించారు.

ఈ క్రమంలోనే ఊరికి సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఊరి అంతర్గత రహదారులు అధ్వాన్నంగా మారినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్ల హామీలు ఏమయ్యాయని నిలదీశారు. “మీకు మంత్రి పదవి తెచ్చుకోవడంపై ఉన్న ఆరాటం, నియోజకవర్గ అభివృద్ధిపై లేదు” అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘డౌన్ డౌన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Raj Gopal Reddy)’ అంటూ యువకులు, మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అంతంపేటలో కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రవేశించి స్థానికులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రజల నిరసనల మధ్యే ఎమ్మెల్యే తన పర్యటనను ముగించుకుని వెళ్లాల్సి వచ్చింది.

Also Read : ఒవైసీ సోదరులు దేశ భక్తులా?: రామచందర్ రావు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>