కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy)కి సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ అయ్యాయి. ఆయన సమర్పించిన దరఖాస్తులో ఇంటి పేరు సరిపోలకపోవడంతో నోటీసులు అందించారు. ఆయన సమర్పించిన ఆధార్, ఓటర్ కార్డులో ఇంటి పేరు వేర్వేరుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి పేరు సరి చేసి మరోసారి ఎన్నికల అధికారులకు దరఖాస్తు సమర్పించబోతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 93 లక్షల మందికి ఎన్నికల అధికారులు నోటీసులు అందిస్తున్నారు. ఓటర్ పేరు, తండ్రి పేరు, చిరునామా తప్పుగా నమోదైన వారు నోటీసులు తీసుకుంటున్నారు. వాటిని సరిచేసి మరోసారి బీఎల్వోలకు అందించాలని చెబుతున్నారు. చాలా మంది తమ వివరాలు కరెక్టుగానే ఉన్నా.. నోటీసులు రావడంపై ఆందోళన చెందుతున్నారు.

