కలం, వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) మరో హెచ్చరిక జారీ చేశారు. డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా క్యాబ్స్, ఆటో డ్రైవర్లు బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వారిపై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కఠినంగా యాక్షన్ తీసుకుంటామన్నారు సీపీ సజ్జనార్ (CP Sajjanar). న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే వాట్సప్ నెంబర్ 9490616155కు కాల్ చేయాలని తెలిపారు.


