కొండా సురేఖ బర్తరఫ్.. మల్లు రవి రియాక్షన్

కలం, వెబ్ డెస్క్ : మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ (Konda Surekha) ను బర్తరఫ్ చేయడంపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి (Mallu Ravi) స్పందించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి వివాదంలో అన్ని విషయాలు తెలుసుకుని అధిష్ఠానానికి రిపోర్ట్ ఇచ్చానని ఆయన వెల్లడించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో ఏఐసీసీ నుంచి తుది నిర్ణయం వచ్చిందని చెప్పారు.

అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించారని మల్లు రవి స్పష్టం చేశారు. చిన్నారెడ్డిని తెలంగాణ ప్రణాళిక సంఘం చైర్మన్ పదవి నుంచి తొలగించారని.. కొంత ఆలస్యమైనా.. ప్రజాస్వామికంగా నిర్ణయం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు సుష్మిత తప్పుగా మాట్లాడితే ఆమె ఖండించలేదని ఆయన గుర్తు చేశారు. ఆ కారణంగానే  సురేఖ మీద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

కొండా సురేఖ మీద ఇప్పుడు తీసుకున్న చర్యకే ఇంతకాలం పట్టిందని, ఇప్పుడు ఆమె మళ్లీ ఏమైనా మాట్లాడినట్లు తమ దృష్టికి రాగానే పరిశీలిస్తామన్నారు మల్లు రవి. అలాగే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కూడా ఫిర్యాదు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేవారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>