కలం, వెబ్‌డెస్క్: అక్రమాస్తుల కేసులో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం (TTD Deputy EO Lokanatham)ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు లోకనాథం ఇంట్లో, ఆయన బంధువుల ఇళ్లల్లో, ఇంకా పలు చోట్ల ఏసీబీ (ACB) అధికారులు తనిఖీలు నిర్వహించారు. లోకనాథం తిరుపతిలోని పెద్దకాపు లే అవుట్ వద్ద నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం నుంచి నేటి ఉదయం వరకు ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు. అధికార దుర్వినియోగంతో ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. సోదాల అనంతరం లోకనాథంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనను నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు.
Also Read : భర్తను చంపించిన భార్య.. పట్టించిన మద్యం సీసా మూత!
Follow Us On : WhatsApp

