రేష‌న్ ల‌బ్ధిదారుల‌కు గుడ్ న్యూస్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: రేష‌న్ ల‌బ్ధిదారుల‌కు తెలంగాణ స‌ర్కార్ (Telangana Govt) శుభ‌వార్త చెప్పింది. రేష‌న్ పంపిణీ (Ration Distribution) గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌కటించింది. ఆగ‌స్ట్ 31తో రేష‌న్ పంపిణీ గ‌డువు ముగిసింది. ఎల్‌నినో నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఆగ‌స్ట్‌, సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌ల‌కు సంబంధించిన రేష‌న్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల రాఖీ పండుగ‌, సెల‌వులు రావ‌డంతో చాలా వ‌ర‌కు ప్ర‌జ‌లు రేష‌న్ బియ్యం తీసుకోలేద‌ని పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌ అధికారులు గుర్తించారు. దీంతో గ‌డువు పొడిగిస్తున్న‌ట్లు తెలిపారు.

ల‌బ్ధిదారులు సెప్టెంబ‌ర్ 5న సాయంత్రం వ‌ర‌కు రేష‌న్ తీసుకోవ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. బ‌యోమెట్రిక్‌లో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చూడాల‌ని జిల్లాల‌ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌జ‌లు స‌మీప రేష‌న్ షాపుల వ‌ద్ద మూడు నెల‌ల బియ్యం తీసుకోవాల‌ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>