పెండింగ్‌ కేసులపై నిర్మల్‌ ఎస్పీ ఫోకస్‌

కలం, నిర్మల్‌: రాష్ట్ర డీజీపీ నిర్వహించిన రెండు రోజుల సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలు, సూచనలను క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందికి చేరవేసేందుకు నిర్మల్‌ జిల్లా ఎస్పీ(Nirmal SP) జానకి షర్మిల (Janaki Sharmila) మంగళవారం సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందితో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 90, 60 రోజుల కాలపరిమితి గల బీఎన్‌ఎస్‌ కేసులతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు, నిందితుల అరెస్టు, రికవరీ, చార్జ్‌షీట్‌ దాఖలు తదితర అంశాలపై ఎస్పీ సమీక్షించారు. ప్రతి కేసులో నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోలీసు అధికారులు తమ పరిధిలో పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేయాలని సూచించారు. అత్యవసర సమయంలో ప్రజలు వినియోగించే డయల్‌ 112కు సకాలంలో స్పందించాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌, నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, స్టేషన్‌ రైటర్లు, సీసీటీఎన్‌ఎస్‌ రైటర్లు, టెక్‌ టీమ్‌, బ్లూ కోల్ట్స్‌, పెట్రోల్‌ కార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>